స్డూడెంట్ మల్లెతోటకి అమ్మాయిని తీసుకువెళ్లాడు – చివరకు దారుణం

స్డూడెంట్ మల్లెతోటకి అమ్మాయిని తీసుకువెళ్లాడు - చివరకు దారుణం

0
98

కొంత మంది నీచులు అత్యంత దుర్మార్గులు పసిపాపలపై కూడా అత్యాచారం చేస్తున్నారు…మైనర్ పిల్లలని ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేసి వారి పశువాంచ తీర్చుకుంటున్నారు.. తాజాగా తొమ్మిదేళ్ల చిన్నారిపై 14 ఏళ్లు ఉన్న ఓయువకుడు మాయమాటలు చెప్పి ఆమెని రేప్ చేయడానికి ప్రయత్నించాడు.

అసలు ఆమెకి ఏమీ తెలియని వయసు, కాని ఆమెని టార్గెట్ చేశాడు, ఈ యువకుడు…దీంతో చిన్నారికి భయం వేసింది.. కేకలు వేసి అతని దుర్మార్గం పసిగట్టి పారిపోవాలి అని ప్రయత్నించింది, దీంతో ఆమెని కొట్టి చంపాడు ఈ యువకుడు. తమిళనాడులోని మణప్పరై లో జరిగింది ఈ దారుణం.

ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది బాలిక . ఇదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు.. చిన్నారిపై కన్నేశాడు. ఈ క్రమంలో చిన్నారికి మాయమాటలు చెప్పి గ్రామానికి సమీపంలో ఉన్న మల్లెపూల తోటలోకి తీసుకెళ్లాడు. దీంతో ఆమెకి అతని చర్యతో భయం వేసి వెంటనే అక్కడ నుంచి పారిపోవడానికి యత్నించింది, కాని ఆమెని పట్టుకుని బండరాయతో కొట్టి చంపేశాడు.

చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని స్థానికులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే బాలుడ్ని పోలీసులు విచారించారు.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతనిని విచారిస్తే పూర్తిగా వివరాలు చెప్పాడు నిజం ఒప్పుకున్నాడు, వెంటనే అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.