2024లో టీడీపీకి చెందిన ఆ లేడీ లీడర్ గెలుపు గ్యారెంటీ అట….

2024లో టీడీపీకి చెందిన ఆ లేడీ లీడర్ గెలుపు గ్యారెంటీ అట....

0
119

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజకీయం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే… ఆయన దూకుడు రాజకీయాలు చేయడంలో దిట్టా అంటారు అక్కడి ప్రజలు… అంతేకాదు పాలిటిక్స్ లో ఆయన భావజలమే డిఫరెంట్ అంటారు… టీడీపీ సీనియర్ నాయకుడుగా మూడు దశాబ్దాలుగా రాజకీలు చేశారు…

2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి కేంద్రమంత్రి అయ్యారు…. ఇక 2019 ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేశారు… అయితే విజయనగరం జిల్లాలో వైసీపీ సునామి నేపథ్యంలో తండ్రీ కూతురు ఓటమి చెందారు… ఓటమి చెందిన తర్వాత నుంచి గజపతిరాజు ఇంటికే పరిమితం అయ్యారు… అనారోగ్య సమస్యతో ఢిల్లీలో ఉండిపోయారు… వాస్తవానికి విజయనగరం జిల్లా అసెంబ్లీ సీటు అశోక్ గజపతి రాజు ఫ్యామిలీకి కంచుకోట..

కానీ ఈ సీటును కూడా వైసీపీ కౌవసం చేసుకుంది… ఇక్కడ మొదటి సారి పోటీ చేసిన అదితి గజపతిరాజు ఓటమి చెందినా కూడా ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు… నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటిని పరిస్కరించే ప్రయత్నాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు… 2024 ఎన్నికల వరకు ఇలాగే ప్రజల్లో ఉంటే ఆమె గెలుపు నల్లేరుమీద నడకే అంటున్నారు…