శ్యామ్ కే నాయుడిపై సినీ నటి ఫిర్యాదు – మోసం చేశాడు

శ్యామ్ కే నాయుడిపై సినీ నటి ఫిర్యాదు - మోసం చేశాడు

0
113

సినిమా పరిశ్రమలో మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది, టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని సినీ నటి సాయి సుధ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు.
పలు హిట్ సినిమాలకు ఆయన పని చేశారు, గతంలో బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు.

ఇక సాయి సుధ పలు సినిమాల్లో కూడా నటించింది, అర్జున్ రెడ్డిచిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించారు. ఈ వివాదం పై పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు.