బ్రేకింగ్ న్యూస్ – ఉపాసన ఇంట విషాదం..

బ్రేకింగ్ న్యూస్ - ఉపాసన ఇంట విషాదం..

0
98

మెగావారి ఇంటి కోడలు ఉపాసన, రామ్ చరణ్ సతీమణి , ఏ విషయం అయినా సోషల్ మీడియాలో అప్ డేట్ ఇస్తారు, సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఆమె అమలు చేస్తారు, అయితే తాజాగా వారి ఇంట ఓ విషాదం జరిగింది,. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు (92) మంగళవారం కన్నుమూశారు.

వారి కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి ఆయన, అలాంటి ఆయన ఈరోజు మరణించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది, ఆమె తాతయ్య చాలాపేరున్న వ్యక్తి, వయసు పైబడటం వల్ల ఇలా తుది శ్వాస విడిచారు అని తెలుస్తోంది.హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

తెలంగాణలోని దోమరకొండలో జన్మించిన ఉపాసన తాత ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్గా పని చేశారు. టీటీడీ ఈవోగా ముందు పని చేసింది ఆయనే, అంతేకాదు ఆయన పలు కవితలు రాశారు, ఉర్దూ కూడా బాగా మాట్లాడతారు. ఉమాపతి రావు 1928 జూన్ 15న జన్మించారు. ఆయన మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా నివాళులు అర్పించింది.