బంగారం ధర రెండు రోజులుగా మార్కెట్లో తగ్గుతూనే ఉంది, తాజాగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది.బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి, అందుకే మన భారతీయ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 తగ్గి రూ.44,310కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.48,090కు చేరింది. ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే ఉంది, వెండి ధర తగ్గింది.
కేజీ వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ.800 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.47,900కు చేరింది, ఇక ధర 50 వేల మార్క్ చేరుతుంది అనే సమయంలో బంగారం ధర తగ్గింది, మళ్లీ షేర్ల విలువ పెరగడంతో చాలా మంది బంగారం కంటే షేర్లపై పెట్టుబడి పెడుతున్నారు.. అందుకే బంగారం ధర తగ్గింది అంటున్నారు అనలిస్టులు.