ఆర్టీసీ విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్

ఆర్టీసీ విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్

0
109

దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది, ఈ సమయంలో ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. కాని అన్నీ చోట్ల ప్రజా రవాణా విషయంలో ఆర్టీసీ బస్సులకి ఏడు తర్వాత అనుమతి ఇవ్వడం లేదు, దీంతో చాలా వరకూ రాత్రి ప్రయాణాలు ఎవరూ చేయడం లేదు.

ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాక, ఇప్పటి వరకూ జిల్లాల బస్సులకు జేబీఎస్కు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై ఎంజీబీఎస్లో ఆగేందుకు అవకాశం ఇస్తున్నారు, తాజాగా తెలంగాణ సర్కారు దీనిపై నిర్ణయం తీసుకుంది, నేటి నుంచి అన్నీ సర్వీసులు రాత్రి కూడా తిరుగుతాయి.

ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్లో రోజుకు రూ.15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, ఇప్పుడు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వస్తోంది. ఆక్యుపెన్సీ కేవలం 39 శాతం మాత్రమే ఉంది. అందుకే అధికారులు ఇవి చెప్పడంంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం వేడి ఎండ ఉంటోంది అందుకే ప్రజలు రాత్రి ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ సమయంలో రాత్రి బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు ఇతర రవాణా వాహనాలకు సైతం అనుమతి ఇచ్చారు.