భర్త క్వారంటైన్ లో ఉండగా ప్రియుడితో పారిపోయిన భార్య ? ఏమైందంటే

భర్త క్వారంటైన్ లో ఉండగా ప్రియుడితో పారిపోయిన భార్య ? ఏమైందంటే

0
97

ఈ లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా అందరూ ఇంటిలోనే ఉంటున్నారు, ఎవరూ బయటకు రాని పరిస్దితి, ఓ పక్క క్వారంటైన్ ఉండే వారు ఉంటున్నారు, ఇక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ లాక్ డౌన్ చాలా ఇబ్బంది కలిగిస్తోంది, తమ ప్రియులని కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది..కొందరి చాటు మాటు వ్యవహారాలు అన్నీ బయటకు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో ఇదే తరహాలో ఓ వివాహేతర సంబంధం బయటపడింది. భర్త హోమ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో అతడి భార్య ప్రియుడితో పరార్ అయింది.. భర్త వలసకూలీ ఈ మధ్య ఇంటికి వచ్చేశాడు, దీంతో అతనిని ఇంటిలో ఉండాలి అని చెప్పారు అధికారులు.

అతడు తన ఇంట్లోనే పై అంతస్తులో హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. భార్య – పిల్లలు కింద ఫ్లోర్ లో ఉంటున్నారు. ఈ సమయంలో ప్రియుడితో ఏకాంతంగా కొన్ని రోజులు గడిపింది భార్య, ఇక ఆమె చేసే పని ఎవరికి తెలియలేదు, ఈ సమయంలో భర్తని పైన ఉంచి తలుపు లాక్ చేసి ప్రియుడితో జంప్ అయింది. చివరకు స్నేహితులకి ఫోన్ చేసి డోర్ లాక్ ఓపెన్ చేయించాడు, పోలీసుకు ఫిర్యాదు చేశాడు భర్త.