పెళ్లంటూ పరిచయం- చివరకు లక్షలు కొట్టేసింది

పెళ్లంటూ పరిచయం- చివరకు లక్షలు కొట్టేసింది

0
101

చాలా మంది విలాసాలకు అలవాటు పడుతున్నారు… దీని కోసం అడ్డదారులు తొక్కుతున్నారు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.. కాలిఫోర్నియాలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి సంబంధం కోసం ఓ మాట్రిమొనిలో దరఖాస్తు చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబం. తేలికగా డబ్బు సంపాదించాలని పెళ్లి సంబంధాలు వెతికే ఎన్ఆర్ఐని మోసం చేయాలని పక్కా స్కెచ్ వేశారు. ఇలాగే తన పేరుని కీర్తి అని తెలియచేస్తూ ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశారు, ఇలా ఓ ఎన్ ఆర్ ఐ కి కట్టుకథ వినిపించారు.

తాను ఒక్కత్తే కుమార్తెనని, కోట్ల రూపాయల ఆస్తులను తన పేరు మీదికి మార్చుకోవాలంటూ నమ్మించి విడతలుగా రూ.65లక్షలు తన ఖాతాలో వేయించుకొంది. తన తల్లితో వివాదాల వల్ల ఇలా చేస్తున్నాను అని ఆమె తెలిపింది, దీనిపై ఆరా తీశాడు టెకీ , చివరకు మోసపోయాను అని టెకీ గుర్తించాడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆరాతీసి వారి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.

.