పోలీసులకి లాక్ డౌన్ వేళ జగపతి బాబు ఏం ఇచ్చారంటే

పోలీసులకి లాక్ డౌన్ వేళ జగపతి బాబు ఏం ఇచ్చారంటే

0
97

ఆయన సినిమాలు అంటే ఓ క్రేజ్ …ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అలరించారు జగపతి బాబు… ప్రస్తుతం విలన్గా, సపోర్టింగ్ పాత్రలలో కనిపించి అదరగొడుతున్నారు, ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాలు అన్నింటిలోను జగపతిబాబు నటిస్తున్నారు, ఆయనకు ఇప్పుడు మరింత ఫేమ్ వచ్చింది..అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా ఈ వైరస్ లాక్ డౌన్ వేళ చాలా నష్టపోయింది.

వారిని ఆదుకుంటున్నారు సినిమా పెద్దలు.. ఇప్పటికే సీసీసీ ద్వారా సినీ కళాకారులకి సాయం అందిస్తున్నారు.. తాజాగా వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ఇటీవల సినీ కార్మికులకు స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె ఇలాంటి నిత్యావసరాలను అందించారు. ఈ సమయంలో లాక్ డౌన్ పూర్తిగా అమలు చేస్తున్న పోలీసులకు కూడా ప్రశంసించారు.

గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ వి.సి.సజ్జనార్ను కలిసిన జగపతిబాబు, పోలీసులకి ఎన్-95 మాస్కులు, శానిటైజర్లను అందించారు . జగపతిబాబు ఔదార్యంపై ప్రశంసలు వర్షం కురుస్తుంది.