మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న సన్యాసి నాయుడు అనే వ్యక్తి వాలేంటరీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి దగ్గర అచ్యుతపురం మండలం నున్నపర్తి గ్రామానికి చెందిన సన్యాసి నాయుడు గత కొద్దికాలంగా పని చేస్తున్నాడు…
అయితే తన స్వగ్రామం అయిన నున్నపర్తి గ్రామంలో తాతలదగ్గర నుంచి సంరక్షించిన స్థలంలో ఇటీవల తన నివాసం కొరకు గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు… అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన వ్యక్తి గ్రామ వాలేంటరీగా నియమింపబడ్డాడు…
అయితే డ్రైవర్ సన్యాసి నాయుడు తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించాలంటే వాలేంటరీ అయిన వ్యక్తికి 50 వేలు చెల్లించాలని వేధింపులకి గురి చేస్తున్నాడని సూసైడ్ నోట్ లో తెలిపారు.. మృతుడి బంధువులు వాలేంటరీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…