లాక్ డౌన్ 5.0 వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్స్

లాక్ డౌన్ 5.0 వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్స్

0
106

ఈ వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ మరోసారి కేంద్రం పొడిగించింది, జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించినట్లు కేంద్రం ప్రకటన చేసింది…పలు మార్గదర్శకాలు లాక్ డౌన్ 5.0 లో ఇచ్చింది కేంద్రం.
ఇక జూన్ 8 నుంచి కంటైన్మెంట్ జోన్లు కాని ప్రదేశాల్లో మాల్స్, రెస్టారెంట్లు అలాగే మతపరమైన ప్రదేశాలకు అనుమతి ఇచ్చారు, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి.

ఇక స్కూళ్లు కాలేజీలు అన్నీంటిపై జూలైలో నిర్ణయం తీసుకుంటారు, ఇక అంతర్జాతీయ విమానాలపై కూడా ఇప్పుడు నిషేదం విధించారు. ఇక అంతరాష్ట్ర రవాణా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఎలాంటి ఆంక్షలు లేవు.. ఎవరు ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, కాని ఆ స్టేట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం..సాధ్యమైనంతవరకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని తెలిపారు, ఒకవేళ ఆఫీసులకి వచ్చినా భౌతిక దూరం పాటించాలి, పనిగంటల్లో మార్పు ఉండాలి.థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ శానిటైజర్ సదుపాయం ఉండాలి.