కొడుకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తండ్రిని జైలుకి పంపింది

కొడుకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తండ్రిని జైలుకి పంపింది

0
102

ఇప్పుడు యువత అన్నం లేకపోయినా పర్వాలేదు కానిసెల్- డేటా కచ్చితంగా కావాలి అంటున్నారు, అలా సెల్ ఫోన్లు మన జీవితంలో పక్కాగా కలిసిపోయాయి అనే చెప్పాలి.ఉదయం దేవుడి రూపం చూడటం మానేసి పక్కనసెల్ ఉందా లేదా అని చూసే రోజులు వచ్చేశాయి, అంతలా భాగం అయింది సెల్, ఎంత మంచికి సోషల్ మీడియాని వాడోచ్చో అంత చెత్త పనులకి కూడా కొందరువాడుతున్నారు.

తాజాగా ఓ యువకుడు చేసిన పనికి పాపం అతని తండ్రి జైలుకి వెళ్లాడు, తమిళనాడుకు చెందిన ఓ కుర్రాడు వయసు 16ఏళ్లు, తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో చైల్డ్ పోర్న్ అప్లోడ్ చేశాడు. తన తండ్రి మొబైల్ను ద్వారా తన ఫేస్బుక్ అకౌంట్ లో ఈ వీడియో పెట్టాడు. వెంటనే దీనిని గుర్తించారు పోలీసులు.

ఇంకేముంది ముందు మొబైల్ నెంబర్ ఎవరిది అనే విషయంలో పూర్తిగా వివరాలు చూస్తే ఆ యువకుడి తండ్రిది అని తేలింది, తండ్రీకొడుకులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎంత పని చేశావురా అని ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు, చూశారుగా మీ పిల్లలకి సెల్ ఇవ్వడమే కాదు, వారు ఏం చేస్తున్నారో కూడా ఓ కన్నేయ్యండి.