బ్రేకింగ్ – తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేకి కరోనా

బ్రేకింగ్ - తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేకి కరోనా

0
131

ఈ వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు, రిచ్ పూర్ అనే భేదం కూడా లేదు.. ఎవరికి అయినా వస్తోంది, ఇక వైరస్ వచ్చిన వారితో ఉంటే చాలు సులువుగా అంటుకుంటోంది, ఇక ముంబై మహరాష్ట్రలో అయితే కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది అని చెప్పాలి.

ఇక్కడ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి మంత్రులకి కూడా కరోనా సోకింది, తాజాగా తెలంగాణలో కలకలం రేపింది కరోనా.బీజేపీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన భార్య, కుమారుడికి కూడా పరీక్షలు చేయగా.. వారికి కూడా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.

దీంతో నేతలు అందరూ అలర్ట్ అయ్యారు, ఈ మధ్య బయట ప్రజలకు సేవ చేసే సమయంలో ముంబైలో పలువురు నేతలకు వైరస్ సోకింది అని తేల్చారు, అందుకే జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఇలా సోకుతోందని ప్రజలు గుమిగూడవద్దు అని చెబుతున్నారు వైద్యులు..లాక్ డౌన్ సమయంలో చింతల రామచంద్రారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలా అందజేసిన సమయంలో వైరస్ ప్రబలి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ వార్తలపై చింతల రామచంద్రారెడ్డి స్పందించారు. తనకు వైరస్ సోకిందని.. అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి మాస్క్ ధరించాలి ప్రతీ ఒక్కరు మరిచిపోకండి.