మొత్తానికి రవాణా విషయంలో కేంద్రం ఇప్పటికే అన్నీ సరుకు వాహనాలు తిరగచ్చు అని తెలిపింది, అంతేకాదు ప్రజా రవాణా విషయంలో ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని తెలిపాయి, దీంతో కొన్నిస్టేట్స్ మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు కేసుల సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఈపాస్ తీసుకోవాలి అని క్వారంటైన్ లో ఉండాలి అని చెబుతున్నాయి.
అయితే ఏపీలో ఆర్టీసీ బస్సులు తెలంగాణకు వస్తాయా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది,
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ఇతర రాష్ట్రాలకు సైతం బస్సు సర్వీసులను నడపనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో తాజాగా ఆర్టీసీ ఏసీ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ విజయవాడ మార్గంలో ఇప్పటికే ఇంద్ర బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఇక ప్రయాణికుల డిమాండ్ ఉంటే, తిరుపతి , కడప , కర్నూలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎక్కువ ప్రయాణికులు ఉంటే బస్సులు ఎక్కువ నడపాలి అని చూస్తున్నారు అధికారులు.