ఏపీలో రైలు దిగగానే ప్రయాణికులకు కండిషన్స్ ఇవే

ఏపీలో రైలు దిగగానే ప్రయాణికులకు కండిషన్స్ ఇవే

0
96

జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి, ప్రజా రవాణాలో భాగంగా ముందు ఈ రెండు వందల స్పెషల్ ట్రైన్స్ వేసింది కేంద్రం, ఇక దీనికి ఆన్ లైన్ రిజర్వేషన్ కల్పించారు, అయితే ఏపీ తెలంగాణ మీదుగా కొన్ని ట్రైన్స్ ప్రయాణిస్తున్నాయి, ఈ సమయంలో ప్రయాణికులు ఆయా స్టేట్స్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా క్వారంటైన్ లో ఉండాల్సిందే.

మరి ఏపీలో రైలు ప్రయాణికులకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది చూస్తే..ప్రతీ రైల్వే స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు… ప్రయాణికులు అందరూ క్యూ లో వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలి..
ఇక వైరస్ లక్షణాలు కనిపించకపోతే వారికి స్టాంప్ వేస్తారు, వారు 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలి.

హైరిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని ప్రభుత్వ క్వారెంటైన్ కు తరలిస్తారు. ఢిల్లీ, ముంబై, గుజరాత్, తమిళనాడు నుంచి ఎవరు వచ్చినా ప్రభుత్వ క్వారెంటైన్ లో వారం ఉండాలి, తర్వాత వారికి టెస్ట్ చేస్తారు, నెగిటీవ్ వస్తే స్టాంప్ వేసి మరో ఏడు రోజులు హొం క్వారంటైన్ లో ఉండాలని చెబుతారు, ఒకవేళ తక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల నుంచి వస్తే 14 రోజులు హొం క్వారంటైన్ లో ఉంటే చాలు.