చాలా మంది గ్రామాల్లో ఉండే అమ్మాయిలని ఉద్యోగాలు ఇప్పిస్తామని టౌన్ కు సిటీకు తీసుకువెళతారు, మాయ మాటలు చెప్పి వారి బుట్టలో వేసుకుంటారు.. ఉద్యోగాల పేరుతో వారిని బ్రోకర్స్ కు అప్పగిస్తారు ఇలా వారి జీవితం నాశనం చేస్తారు, అయితే ఇంకొందరు ఉద్యోగాలు అంటూ శారీరకంగా వారి వాంచ తీర్చుకుంటారు తాజాగా ఈ లాక్ డౌన్ వేళ దారుణం జరిగింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో. ఓ యువతిని తన మేనత్త మార్చిలో ఉద్యోగం పేరుతో సిటీకి తీసుకువచ్చింది, మార్చి 20న నందన్ అనే వ్యక్తి దగ్గరకు ఆమెను పంపింది. ట్రైనింగ్ పేరుతో నందన్ ఆమెను ఓ హోటల్ గదిలో ఉంచాడు. ఇక లాక్ డౌన్ పెట్డడంతో ఆమె అక్కడే ఉండిపోయింది, ఇది అదునుగా చేసుకున్న అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నందన్ రోజూ తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు అని తెలుస్తోంది, చివరకు చంపేస్తామని బెదిరించడంతో ఆమె లొంగిపోయింది, ఫోన్ కూడా తీసేసుకున్నారు, దీంతో ఆమెని బయటకు రాకుండా చేశారు, అయితే ఆమె మేనత్తకి తెలిసి ఈ విషయం జరిగిందా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు, చివరకు ఆమెని పోలీసులు విడిపించారు, ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటోంది, తల్లిదండ్రులు ఆమెని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.