ఓ వ్యక్తి తన భార్యనే అమ్మకానికి పెట్టాడు ఇది విని అందరూ షాక్ అయ్యారు, సోషల్ మీడియాలో తన భార్య ఫోటో- రేటు పెట్టి ఫోన్ నెంబర్ పెట్టాడు ఈ మూర్ఖుడు, ఇంతకీ దేనికో తెలిసి ఆమె పోలీసులు ఆశ్చర్యపోయారు..ఉత్తర ప్రదేశ్‌లోని తుథియాలో చోటు చేసుకుంది ఈ ఘటన.
పునీత్ అనే వ్యక్తి తన భార్యను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనకు బైక్ కావాలని, పుట్టింటి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇవ్వాలని ఆమెను కొడుతున్నాడు. ఇక భర్త వేధింపులు భరించలేని ఆమె వెంటనే పుట్టింటికి వెళ్లిపోయింది, అయితే ఆమె వెళ్లినా ఆ బైక్ కొనాలి అని భావించాడు.
అయితే బైక్ కోసం తన భార్యను అమ్మేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఆమె ఫొటోను, ఫోను నంబరును పోస్ట్ చేశాడు. కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఫోన్ నెంబర్ పెట్టాడు, ఆమెకి రోజుకి వందల ఫోన్లు వచ్చేవి చివరకు ఆరా తీస్తే భర్త చేసిన దరిద్రపు పని తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు బైక్ కాదు కాని సెల్ లో ఊచలు లెక్కపెడుతున్నాడు ఈ భర్త.