హైదరాబాద్ బెంగళూరుకి బస్సులు అక్కడకు నో పర్మిషన్

హైదరాబాద్ బెంగళూరుకి బస్సులు అక్కడకు నో పర్మిషన్

0
83

జూన్8 నుంచి పలు సడలింపులు ఇచ్చింది కేంద్రం, అన్ లాక్ 1 అమలులో ప్రజా రవాణా విషయంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నడపాలి అని చూస్తున్నారు ఏపీలో అధికారులు.దీనిపై ఏపీఎస్ఆర్టీసీ కార్యాచరణ సిద్దం చేస్తోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది.ఇప్పటికే ఏపీసీఎస్
నీలం సాహ్ని తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు లేఖ రాశారు.

అక్కడ నుంచి పర్మిషన్ రాగానే ఇక బస్సులు నడపనున్నారు, వెంటనే రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తారు, అయితే బెంగళూరు హైదరాబాద్ కు ఈ బస్సులు నడుస్తాయి అని తెలుస్తోంది, మరో పక్క తమిళనాడులో కేసుల సంఖ్య పెరుగుతోంది అందుకే అక్కడకు బస్సులకు అనుమతి లేదు అని చెప్పింది ప్రభుత్వం, అందుకే చెన్నై సర్వీసులకి మరింత సమయం పడుతుంది.

గతంలో తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు స్పందన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు, వీరిలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల ద్వారా వచ్చేశారు, అయితే ఇవన్నీ చూసుకుని ముందు వారికి పర్మిషన్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.