ఏపీలో దేవాలయాలకు వస్తే ఇవి పాటించాల్సిందే- జూన్ 10 నుంచి దర్శనాలు

ఏపీలో దేవాలయాలకు వస్తే ఇవి పాటించాల్సిందే- జూన్ 10 నుంచి దర్శనాలు

0
87
Sunset seen at Hampi in Bellary Dist on Saturday. -KPN ### weekend Sunset seen at Hampi

జూన్ 8 నుంచి ఇంకా పలు సడలింపులు ఇచ్చింది కేంద్రం, అందులో భాగంగా దేవాలయాలు ప్రార్ధనా మందిరాలు, తెరచుకోవచ్చు, మాల్స్ హోటల్స్ , రెస్టారెంట్లు కూడా తెరచుకుంటాయి, అయితే కంటైన్ మెంట్ జోన్లు ఉన్న ప్రాంతంలో దేవాలయాలు మాత్రం తెరచుకోవు, ఇక ఇప్పటికే తిరుమల శ్రీశైలం విజయవాడలో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో అన్నీ ఆలయాల్లో ఈనెల 10 నుంచి భక్తులను అనుమతించనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.. ముందుగా ఈనెల 8, 9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులతో ప్రయోగాత్మక దర్శనానికి అనుమతించి లోటుపాట్లను సరిచేస్తామని చెప్పారు. ఇక ప్రతీ భక్తుడు మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రం చేసుకుని దర్శనానికి రావాలి, భౌతిక దూరం పాటించాలి.

సర్కిల్ మార్క్ లో నిలబడి క్యూ లైన్ లో పద్దతి పాటించాలి..ఆలయ పరిసరాల్లో ఉమ్మివేయడం నిషిద్ధమని మంత్రి తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు, చిన్నపిల్లలు దర్శనానికి రాకపోవడం మంచిదని తెలిపారు. ఇక రాష్ట్రంలోని అన్నీ ఆలయాల్లో శఠగోపం, తీర్థ ప్రసాదాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు, ఇవన్నీ పరిశీలించి భక్తులు దర్శనానికి రావాలి.