రేవంత్ రెడ్డిపై పోసాని హాట్ కామెంట్స్…

రేవంత్ రెడ్డిపై పోసాని హాట్ కామెంట్స్...

0
96

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు… 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెట్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవినీతి పరుడని విమర్శలు చేయడం దారుణం అని మండిపడ్డారు…

రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కేసీఆర్ అవినీతి పరుడే అయివుంటే, ఆయన నిరూపించాలని డిమాండ్ చేశారు… అంతేకాదు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అన్నారు పోసాని…

80 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ప్రతిపక్షం కూడా మెచ్చుకోవాలని అన్నారు… ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి నాయకుడని ఆయన పక్కన నిజాయితీ పరులు ఉంటే మంచిదని అన్నారు… ఇరు రెండు తెలుగు రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రులు ఉన్నారని అన్నారు… జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడని తెలిపారు…