నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం

నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం

0
87

టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు మురళీశర్మ.. తెలుగులో పలు కీలకమైన పాత్రల్లో నటించారు, అనేక సినిమాలు చేశారు, అయితే ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటుడు మురళీ శర్మ మాతృమూర్తి శ్రీమతి పద్మగారు గత రాత్రి ముంబైలోని ఆమె సొంత ఇంట్లో కన్నుమూసారు. ఆమె వయసు 76 ఏళ్లు.

కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అనారోగ్యంతో కన్నుమూసినట్టు సమాచారం. ఇటీవల మురళీశర్మ అల వైకుంఠపురంలో కూడా నటించారు, మెప్పించారు, ఆయన తెలుగులో అతిధి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు, అందులో విలన్ పాత్ర అద్బుతంగా చేశారు, ఆయనకు ఈ చిత్రానికి నంది అవార్డ్ కూడా వచ్చింది.

ఆ తర్వాత ఎన్టీఆర్తో కంత్రి సినిమాలో నటించారు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా నటుడిగా మురళీ శర్మకు మంచి పేరు తీసుకొచ్చింది ….పలు సినిమాల్లో దూసుకుపోతున్నారు ఆయన, ఇలా విషాదం జరగడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.