మ‌రో ప‌రువు హ‌త్య కూతుర్ని చంపేసిన త‌ల్లిదండ్రులు

మ‌రో ప‌రువు హ‌త్య కూతుర్ని చంపేసిన త‌ల్లిదండ్రులు

0
92

సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇంత డ‌వ‌లప్ అయింది, అయినా కులాలు మ‌తాల కోసం చాలా మంది వెంప‌ర్లాడుతున్నారు, మ‌రీ ముఖ్యంగా వివాహాల విష‌యంలో వేరే కులం వారిని చేసుకోవ‌డానికి చాలా మంది అంగీక‌రించ‌డం లేదు, ఇక ప‌రువు హ‌త్య‌ల‌కు కూడా తెగ‌బ‌డుతున్నారు.

తాజాగా పరువు కోసం కన్న పేగునే తెంచుకున్నారు . తాజాగా గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. వేరే కులం యువకుడిని ప్రేమిస్తుందనే కోపంతో కన్నకూతురిని తల్లిదండ్రులు చంపేశారు. ఇక్క‌డ ఓ యువ‌తి డిగ్రీ చ‌దువుతోంది, ఆమె మ‌రో కులానికి చెందిన యువ‌కుడితో చ‌నువుగా ఉంది ప్రేమ‌లో ఉంది

ఈ విష‌యం తెలియ‌డంతో త‌ల్లి తండ్రి మంద‌లించారు ప్రేమ వ‌ద్దు అన్నారు.. వారి మాట కాదు అని అతడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తమ కూతురును చంపేశారు. ఇద్దరూ కలిసి తమ కూతురిని గొంతు నులిమి దారుణంగా హత్యచేశారు. ఇప్పుడు క‌ట‌క‌టాల వెనుక ఉన్నారు.