ప‌ది ప‌రీక్ష‌లు లేవు మ‌రి ఫ‌లితాలు ఎప్పుడు ఇస్తారో తెలుసా

ప‌ది ప‌రీక్ష‌లు లేవు మ‌రి ఫ‌లితాలు ఎప్పుడు ఇస్తారో తెలుసా

0
78
AP Inter exams Schedule

మొత్తానికి తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్దు చేశారు, ఇక నేరుగా వారిని త‌ర్వాత త‌ర‌గ‌తుల‌కి ప్ర‌మోట్ చేస్తున్నారు. అయితే, విద్యార్థులు మాత్రం తమకు వచ్చే గ్రేడ్ కోసం ఎదురుచూడాల్సిందే… రాష్ట్రంలో మొత్తం 5,34,903 మంది టెన్త్ విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి.

గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను ప్ర‌మోట్ చేస్తారు, ఇక గ్రేడింగ్ ఈనెల‌లోనే 25 లోపు ఇవ్వ‌నున్నారు, నేటి నుంచి 15 రోజుల్లో ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌.

తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి విద్యార్ధుల ఇంటర్నల్ మార్క్స్ సంబంధించిన డేటా ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు దగ్గర ఉంది..గ్రేడింగ్ విధానంలో ప‌రీక్ష ఫ‌లితాలు రానున్నాయి.