భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రేట్లు ఇవే

0
108

పసిడి ధర భారీగా పెరుగుతోంది, ఇప్పటి వరకూ తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా భారీగా పరుగులు పెడుతోంది. ఇక బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెబుతున్నారు..అంతర్జాతీయంగా గోల్డ్ తగ్గినా ఇండియాలో బంగారం ధర పెరుగుతోంది.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది దీంతో ధర రూ.44,470కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.90 పెరిగింది.రూ.48,510కు చేరింది..
ఇక పసిడి ఇలా ఉంటే వెండి ధర తగ్గింది.

మార్కెట్లో వెండి కిలో 40 తగ్గింది, దీంతో ధర రూ.47,400కు చేరింది. వెండికి పెద్ద డిమాండ్ నిన్న లేకపోవడంతో, మార్కెట్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది, అయితే 50 వేల మార్క్ పదిగ్రాముల బంగారం చేరుకుంటుంది అంటున్నారు అనలిస్టులు.