ఇప్పుడు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి వారికి గ్రేడింగ్ ఇచ్చి రిజల్ట్ ఇవ్వాలి అని అక్కడ ప్రభుత్వం తెలిపింది, పలు రాష్ట్రాలు ఇప్పుడు పది పరీక్షలను రద్దు చేస్తున్నాయి, ఈ సమయంలో ఏపీలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అని అందరూ ఆలోచన చేశారు, అయితే ముందు ఎలా షెడ్యూల్ ప్రకటించామో అదే సమయానికి పది పరీక్షలు జరుగుతాయి అని ఏపీ సర్కార్ తెలిపింది.
పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరిగి తీరుతాయని తేల్చిచెప్పారు. ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
ముందు ప్రకటించిన విధంగా జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాకపోతే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇక పూర్తిగా విద్యార్దులు ఉపాధ్యాయుల ఆరోగ్యం గురించి అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పది పరీక్షలు పెడతాము అని తెలిపారు.