ఈ వైరస్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో మరింత ఆందోళన కలుగుతోంది, ఓ పక్క కేసులు ఇంతలా పెరగడంతో సరిహద్దులు మూసివేసి కొత్త వారిని స్టేట్స్ లోకి రానివ్వకుండా ఇక్కడ పాజిటీవ్ వచ్చిన వారికి చికిత్స అందించాలి అని చూస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.
తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర సరిహద్దులు మూసేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత రాజస్థాన్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం మొదలెట్టాయి. దీంతో సరిహద్దులూ మూసేయాలని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇక రాజస్ధాన్ లోకి ఎవరైనా రావాలి అన్నా ఒకవేళ వారు ఎక్కడికి అయినా వెళ్లాలి అన్నా కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే.
అయితే అన్నీ స్టేట్స్ ఇదే పాటించాలి అని కోరుతున్నారు ప్రజలు.. ఈ విధానం మంచిది అని కోరుతున్నారు, లేకపోతే రాకపోకలు పెరగడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది అని భావిస్తున్నారు.