షూటింగులకి అనుమతులు వచ్చాయి? కాని షరతులు చూస్తే మతిపోతుంది

షూటింగులకి అనుమతులు వచ్చాయి? కాని షరతులు చూస్తే మతిపోతుంది

0
133

ఈ వైరస్ తో లాక్ డౌన్ కాలంలో పనిలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సెట్స్ పై ఉన్న సినిమాలు ఇక షూటింగ్ పూర్తి అయిన సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ఆగిపోవడంతో ఇలా చాలా వరకూ ఇబ్బందుల్లో ఉంది చిత్ర పరిశ్రమ.. అందుకే వారిని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలో షూటింగులకి అనుమతి ఇచ్చింది సర్కార్.

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఈ పలు మార్గదర్శకాలను ప్రకటించింది. మరి ఆ కండిషన్స్ ఓసారి చూద్దాం.

1..షూటింగ్ స్పాట్ లో డాక్టర్లు కంపల్సరీగా ఉండాలి
2..షూటింగ్ స్పాట్ లో పాన్ , గుట్కా తీసుకోకూడదు
3.. షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ, ఎగ్జిట్ రెండు ఉండాలి
4..స్టూడియోల్లో సందర్శకులకు అనుమతి నిరాకరణ
5. ప్రతీ ఒక్కరికీ మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండాలి
6. పరిమిత సిబ్బందితో షూటింగులు చేసుకోవాలి