నిద్రపోతున్న భర్తను కూతురు సహాయంతో గొంతుకోసిన భార్య…

నిద్రపోతున్న భర్తను కూతురు సహాయంతో గొంతుకోసిన భార్య...

0
75

కూతురు సహాయంతో ఘాడంగా నిద్రపోతున్న భర్తగొంతు కోసి హత్య చేసింది భార్య ఈ సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… పుల్యా తండాకు చెందిన బాల్య నాయక్ కు మణెమ్మ దంపతులు వీరికి కుమార్తె ఉంది… బాల్య నాయక్ గతంలో భ్రతుకు దెరువుకోసం హైదరాబాద్ కు వచ్చి అక్కడ ఆటో నడుపుతున్నాడు…

అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వారు స్వగ్రామానికి చేరుకున్నారు… కొన్నిరోజుల తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు… పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధంకలుపుతూ చిత్రహింసలు పెట్టేవాడు ఈ క్రమంలో ఆయన మద్యం తాగడం కూడా అలవాటు చేసుకున్నాడు…

రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు… ఈక్రమంలో మరోసారి మద్యం తాగి వచ్చి గొడవపడి భార్యను కొట్టాడు… ఇక భర్త వేధింపులకు విసిగిపోయిన భార్య తన కూతురు సహాయంతో భర్త నిద్రిస్తున్న సమయంలో అతని గొంతు కోసి హత్య చేసింది… ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..