సైకో కిల్లర్ మాటలు విని షాకైన పోలీసులు

సైకో కిల్లర్ మాటలు విని షాకైన పోలీసులు

0
93

సైకో కిల్లర్స్ మనుషుల ప్రాణాలను దారుణంగా తీసేస్తారు, వారిని అత్యంత దారుణంగా చంపేస్తారు..
తాజాగా పోలీసుల అదుపులో ఓ సైకో ఉన్నాడు, అతను చెప్పిన మాటలు విని షాకయ్యారు పోలీసులు.
వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్ సొంత అన్నను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

ఉత్తరప్రదేశ్, ఈటా జిల్లా ధర్మపుర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల కుర్రాడు గత ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా మరణించాడు. జూన్ 9వ తేదీన అతడి సోదరుడు ప్రశాంత్ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో ఈ కేసులో చాలా విషయాలు పరిశీలించారు పోలీసులు.

. అయితే జూన్ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్ల చిన్నాన్న రాథే శ్యామ్.. సొంత అన్న విశ్వనాథ్ సింగ్ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు. అయితే ముందుగానే గుర్తించిన బంధువులు శ్యామ్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే ఇలా ఎందుకు చంపుతున్నావు అని ప్రశ్నిస్తే తనకు మనుషుల్ని చంపడం చాలా ఇష్టం అని అందుకే ఇలా చంపుతున్నా అని సైకో చెప్పాడు