దాదాపు మూడు నెలలు అవుతోంది, ఏపీ వాసులు కొందరు తెలంగాణలో చిక్కుకుని.. వారు సొంత ప్రాంతాలకు రావాలి అంటే వారికి ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు, దీంతో వారు తమ సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి అవకాశం కల్పించాలని బస్సులు ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు.
అయితే ఇప్పటికే కేంద్రం కూడా బస్సులు నడిపేందుకు అనుమతి ఇచ్చింది, కాని ఏపీ బస్సులు తెలంగాణలోకి వచ్చేందుకు ఇంకా ఇక్కడ అధికారులు చర్చల్లోనే ఉన్నారు.. మరో పక్క
తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ… ఏపీ మాత్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఇంకా ఆమోదం తెలపలేదు.
దీంతో, సొంత వాహనాలు ఉన్నవారు మాత్రం ఈ-పాసులు తీసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. సొంత వాహనాలు లేని వారు మాత్రం బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ఎదురు చూస్తున్నారు..ఈ సమయంలో మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు, త్వరలో ఏపీ తెలంగాణ బస్సులు నడుస్తాయని తెలిపారు, దీనిపై అధికారులు తెలంగాణ మంత్రితో చర్చిస్తామని తెలిపారు.