రాత్రి కర్ఫ్యూ పై కేంద్రం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌

రాత్రి కర్ఫ్యూ పై కేంద్రం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌

0
86

దేశ వ్యాప్తంగా వైర‌స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో కేసుల సంఖ్య ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.. రోజుకి 10 వేల కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి.. అయితే రాత్రి పూట ఇప్ప‌టికే 9 నుంచి కర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.. ఇంకా రాత్రి పూట కర్ఫ్యూ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాలి అని కేంద్రం తాజాగా తెలియ‌చేసింది.

రాత్రి వేళ్లలో గుంపులుగా, సమూహాలుగా తిరిగే వారిని నిలువరించడానికి మాత్రమే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది. స‌రుకు తీసుకువెళ్లే వాహ‌నాలు అలాగే విమానాలు రైలు ప్ర‌యాణాలు చేసే వారు వెళ్లేందుకు వారికి అనుమ‌తి ఉంటుంది.

అనవసర కార్యకలాపాల నివారణకు కోసం మాత్రమే కర్ఫ్యూ అని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో భౌతిక దూరం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు, ఇక దేశంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు స‌రుకు వాహ‌నాలు వెళ్లినా వాటిని ఆప‌ద్దు అని తెలిపారు.