అందుకు సహకరించలేదని పాశవిక దాడి…

అందుకు సహకరించలేదని పాశవిక దాడి...

0
80

అసాంఘిక కార్యకలాపాలకు సహకరించలేదనే నెపంతో గిరిజన యువకునిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బ్రాహ్మణక్రాక గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు పక్క గ్రామానికి చెందిన తన స్నేహితులను 5 మందిని గ్రామానికి తీసుకువచ్చాడు…

కామ కోరిక తీర్చుకోవడానికి గిరిజన యువతిని మాట్లాడాలి అంటూ గిరిజన కాలనీకి చెందిన ఇండోర్ మధవను ఆదేశించాడు… ఇలాంటి పనులు చేయకూడదంటూ తప్పు అంటూ చెప్పాడు దీంతో మధవ సహకరించకపోవడంతో అనిల్ కోపంతో చెయి చేసుకున్నాడు… రాత్రి సమయంలో పని ఉందంటూ గిరిజన యువకుని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హనుమకొండపాలెంలోని పాడుబడిన బంగ్లాలోకి తీసుకువెళ్లారు…

అక్కడ విచక్షణా రహితంగా కొట్టారు… చినిపోతాడనే ఉద్దేశంతో అతన్ని బైక్ పై ఎక్కించుకుని గ్రామంలో వదిలేశారు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు… అక్కడ ఉన్న స్థానికులు అతన్ని ఆసుపత్రికి చేర్పించారు… పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..