తెలంగాణలో ఇప్పుడు వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. ప్రజా ప్రతినిధులకి కూడా వైరస్ సోకుతోంది, ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు వైరస్ సోకింది, తాజాగా మరో ఎమ్మెల్యేకి వచ్చింది, దీంతో ఇప్పుడు ప్రజా ప్రతినిధులు అందరూ టెన్షన్ లో ఉన్నారు..
తాజాగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆయన కూడా చికిత్స తీసుకుంటున్నారు.
ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గోవర్థన్, ఎమ్మెల్యే బిగాల ముత్తిరెడ్డి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక పలువురు నేతలకు వైరస్ సోకడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.