దేశంలో మూడు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది, అయినా కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు, కేసుల తీవ్రత మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో సడలింపులు ఆపేసి మళ్లీ పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయాలి అని ప్రజలు కోరుతున్నారు.
ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ విదిస్తే తప్ప కరోనా ని కంట్రోల్ చేయలేమని పళనిస్వామి సర్కార్ భావించింది. ఇక ముఖ్యంగా వైరస్ కేసులు ఎక్కువ ఉన్న 4 జిల్లాల్లో పూర్తిస్ధాయి లాక్ డౌన్ విధించాలి అని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి జూన్ 30 వరకు గరిష్ట పరిమితం చేయబడిన లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రకటించారు.
అయితే ఈ సమయంలో ఈ నాలుగు జిల్లాల్లో ఉదయం8 నుంచి 2 గంటలకు కిరాణా వెజిటల్ స్టోర్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చారు… జూన్-21,28 ఆదివాకం అన్నీంటికి పూర్తిగా లాక్ డౌన్ అమలు ఉంటుంది.