అసెంబ్లీలో వారికి నో ఎంట్రీ…..

అసెంబ్లీలో వారికి నో ఎంట్రీ.....

0
78

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరుగనున్నాయి….ఇందుకు సంబధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్దం చేసింది… ఈ సమావేశాలు ఈ నెల 20వ తేదీవరకు జరిగే అవకాశం ఉంది… వీడియో ప్రసంగం ద్వారా గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కేవలం బడ్జెట్ ఆమోదం కోసమే ఈ సమావేశాలు నిర్వహించనున్నారు…అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్, సీఎం కార్యాలయాలను నిషేధిత ప్రాంతాలుగా గుర్తించారు…

అనుమతి లేకుండా ఎవ్వరిని రానివ్వకుండా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు… అసెంబ్లీ సెక్రటేరియట్ జారీ చేసి పాసులు తప్పనిసరి అని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాహణాలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు…

శాసనమండలి శాసనసభ సభ్యులు వారి వారి జిల్లాలలోనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని రావాలని తెలిపారు… అలాగే మీడియాకు ఈ సెషన్ లో సభకు అనుమతి లేదని మీడియా కోసం విజయవాడలోని ఆర్ ఆండ్ బీ భవన్ లో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయనున్నారు…