తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ హర్షిస్తారు, ముందు చూపు ఉన్న నాయకుడిగా అన్నీ తెలిసిన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పినా వింటారు, అయితే ఈ లాక్ డౌన్ వేళ ఆయన చెప్పినవి అన్నీ ప్రజలు పాటించారు, అయితే రైతు బిడ్డ అయిన కేసీఆర్ రైతుల వెంటే ఉంటారు.
వారికి దేశంలో ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, రైతులకి భరోసా కల్పిస్తున్నారు, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు.
దీనిపై ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ అయ్యాయి, తెలంగాణలో ఒక్క రైతు కూడా పెట్టుబడికి ఇబ్బంది పడకుండా.. రైతులందరికీ రైతు బంధు సాయం అందించాలని చెప్పారు. వారం,పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు.ఈ ఏడాది నుంచి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.