చైనాలో కేసులు దారుణంగా మళ్లీ పెరుగుతున్నాయి, ఇప్పుడు కేసులు సంఖ్య పెరగడంతో అందరూ టెన్షన్ లో ఉన్నారు..బీజింగ్ కరోనా కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నామేమోననే భయం చైనా రాజధాని వాసులకు నిద్రలేకుండా చేస్తోంది.
స్థానిక జింన్‌ఫాడీ మార్కెట్ తాజాగా కరోనా కేసులకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ మళ్లీ సెకండ్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి…బీజింగ్‌లో కరోనా కేసుల సంఖ్య 106కి చేరింది. రోజుకి దాదాపు పదుల సంఖ్యలో కేసులు పెరిగాయి, ఇది తీవ్రంగా పెరుగుతోంది.
ఇక మళ్లీ ఇక్కడ పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలకు, ఇప్పటికే రాజధానిలో దాదాపు 30 ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేసింది.దీంతో చైనాలో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.