ఎందుకు చైనా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోంది, మనకు చైనాకు మధ్య మళ్లీ ఎందుకు వివాదం వస్తుందనేది చూస్తే. గతం నుంచి భారత దేశం – చైనా మధ్య దాదాపు 3500 కిలో మీటర్ల పొడవున ఉన్న ఎల్ ఐసీ పై ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది.
1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు అక్కడ శాంతిని నెలకొల్పాలని రెండు దేశాలు నిర్ణయించాయి.చాలా వరకూ కొద్ది ఏళ్లు ప్రశాంతంగానే ఉన్నారు, ఇక చైనా ఇక్కడ భారీగా రోడ్లు మౌళిక వసతులకు సంబంధించి రైలు మార్గాలు అన్నీ నెమ్మదిగా నిర్మిస్తోంది.
చైనాకు ధీటుగా భారత్…మౌలిక వసతులను నిర్మించుకొంటోంది. ఇది చైనాకు నచ్చలేదు. ఇటీవలే పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ ప్రాంతాల దగ్గర కీలక రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్ లోయలో దార్బుక్ ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్డీలను సంధానిస్తూ..రోడ్డును నిర్మిస్తోంది. వీటిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది, అక్కడ నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. మొత్తానికి రెండు దేశాల అధికారులు సామరస్యంగా వివాదానికి ముగింపు పలకాలి అని అంటున్నారు ప్రజలు