ఇక చైనా సైనికులు భారత్ పై చేసిన దుశ్చర్య ఈ ఘర్షణలొ మన సైనికులు 20 మంది వీర మరణం పొందారు, అందుకే చైనా మన నుంచి సొమ్ము సంపాదించి వాటితో మనపైనే దాడులకు ఎత్తులు వేస్తోంది, అందుకే చైనా పొగరు అణచాలని ఆ వస్తువులు కొనకూడదు అని చాలా మంది భావిస్తున్నారు.
చాలా వరకూ మన దేశంలో అతి తక్కువ ధరకు వస్తున్న వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకునేవే అందుకే ఇక ఆ చైనా ప్రొడక్ట్స్ చాలా వరకూ బ్యాన్ చేయాలి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
బొమ్మలు, దుస్తులు, బిల్డర్ హార్డ్‌వేర్, పాదరక్షలు, వంటగది సామాను, చేతి సంచులు, సౌందర్య సాధనాలు, బహుమతి వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆహార పదార్థాలు, గడియారాలు, రత్నాలు, ఆభరణాలు, స్టేషనరీ, పేపర్, గృహోపకరణాలు, ఫర్నీచర్, లైటింగ్, ఆరోగ్య ఉత్పత్తులు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఆటో విడి భాగాలు, నూలు, ఫెంగ్ షుయ్ వస్తువులు, దీపావళి, హోలీ వస్తువులు, కళ్ళజోళ్లు వీటిలో చాలా వరకూ చైనా నుంచి వచ్చేవి ఉన్నాయి వాటిని కొనకూడదు అనే క్యాంపెయన్ స్టార్ట్ చేశారు, కాస్త రేటు ఎక్కువ ఉన్నా మన దేశీయ వస్తువులు కొనాలి అని పిలుపునిస్తున్నారు.