ప్రేమించనందుకు బాలికను బీరుసీసాతో దారుణం….

ప్రేమించనందుకు బాలికను బీరుసీసాతో దారుణం....

0
100

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.. తాజాగా వరంగల్ జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది… ప్రేమ పేరుతో ఒక వ్యక్తి యువతిని వేధించాడు… సదరు బాలిక తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెపై బీరుసీసాతో విచక్షణా రహింతంగా దాడి చేశాడు… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు…

వరంగల్ జిల్లాలోని 11వ డివిజన్ కు చెందిన నిఖిల్ పదవడివిజన్ కు చెందిన బాలికను కొద్దికాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు… తనను ప్రేమించాలని వెంటపడేవారు.. ఈక్రమంలో బాలిక నిఖిల్ కు దూరంగా ఉంటూ వచ్చింది.. దీంతో నిఖిల్ తన ప్రేమన అంగీకరించలేదని ఉద్దేశంతో ఇంట్లో ఎవ్వరు లేరని తెలుకుని ఆమె ఇంటివెళ్లి బీరు సీసా పగలగొట్టి విచక్షణా రహింతంగా బాలికపై దాడి చేశారు…

అతనని నుంచి ఆ బాలిక తప్పించుకునే ప్రయత్నంలో చేతికి తీవ్రగాయాలు అయ్యాయి…దీంతో ఆబాలిక గట్టిగా కేకలు వేసింది… నిఖిల్ అక్కడి నుంచి పారిపోయాడు…ఆమెను ఆసుపత్రికి తరలించారు ఎటువంటి ప్రాణాపాయంలేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు… ఇక బాధితుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…