ఈ వైరస్ తో పూర్తిగా అన్నీ దేశాల్లో లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో ఎవరికి ఉపాధి లేదు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు, అయితే అన్నీ రంగాలు కూడా మరో ఆరు నెలల వరకూ ఇలాగే ఉండే పరిస్దితి.
కరోనా కారణంగా బోట్స్ వానా రాజధాని గాబొరోన్ లోని గనుల్లో వజ్రాలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి.
ఇది వరల్డ్ లో ఫేమస్ వజ్రాల గని,. ప్రసిద్ధ మైనింగ్ కంపెనీ డీ బీర్స్ ఇక్కడ వజ్రాల తవ్వకాలు జరిపి మార్కెట్ చేస్తుంటుంది. ఇక ఇక్కడ జనవరి తర్వాత ఒక్క వజ్రం కూడా అమ్మలేదు కరోనా కారణంగా ఎవరూ కొనలేదు.
ఎందుకు అంటే రవాణా లేక వ్యాపారులు అక్కడకు రావడం లేదు.. దీంతో వజ్రాలు అమ్మడం లేదు.. దీంతో కుప్పలు కుప్పలుగా అక్కడ వజ్రాలు ఉన్నాయి, మళ్లీ రవాణా వస్తే అప్పుడు వజ్రాల అమ్మకాలు ఉంటాయి అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల డాలర్ల విలువ చేసే వజ్రపు నిల్వలు ఉన్నాయి అని అంచనా.