భార్య‌కి ఫ్రెండ్ రూపంలో అస‌భ్య‌ మెసేజ్ లు పంపిన భ‌ర్త

భార్య‌కి ఫ్రెండ్ రూపంలో అస‌భ్య‌ మెసేజ్ లు పంపిన భ‌ర్త

0
108

కొంద‌రు ఈ మ‌ధ్య చాలా కంత్రీ నాట‌కాలు ఆడుతున్నారు, భ‌ర్త‌ల‌ను భార్య‌లు మోసం చేయ‌డం చూసే ఉంటాం, ఇక ఈ కేసులో ఏకంగా భర్త భార్య‌ని మోసం చేశాడు. కోటి రూపాయ‌లు కొట్టేశాడు. గచ్చిబౌలికి చెందిన ఒక మహిళకి కరీంనగర్‌ లో ఉంటున్న కుమార్‌కి మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఒకే కులం కావడంతో ఈ పరిచయం కాస్తా పెళ్లి దాకా వెళ్లింది. అయితే ఆమె ఉద్యోగం కార‌ణంగా అమెరికా వెళ్లి ఉంటోంది, ఈ స‌మ‌యంలో భ‌ర్త అవ‌స‌రాలు ఉండ‌టంతో ఆమెకి కార‌ణాలు చెబుతే 63 ల‌క్ష‌లు న‌గ‌దు వేయించుకున్నాడు.

అవి కాక తన స్నేహితుడి పేరు అయిన సత్యహర్ష రెడ్డి అనే పేరుతో సదరు భార్య మొబైల్, మెయిల్‌కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపేవాడు. మిత్రుడు పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమెకి అనుమానం వ‌చ్చింది, ఇది త‌న భ‌ర్త ప‌న్నాగం అని తెలిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది,దీంతో న‌గ‌దు కోసం ఈ ప‌ని చేశాను అని ఒప్పుకున్నాడు భ‌ర్త‌.
.