బాలీవుడ్ స్టార్ హీరో ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు, అయితే ఆయన మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే సుశాంత్ బాలీవుడ్ లో ఉన్న బంధు ప్రీతి కారణంగానే చనిపోయాడని.. అతను డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు కొంత మంది సహనటులు.
అందుకే అందరిని ఈ కేసులో విచారణ చేస్తున్నారు పోలీసులు, ముఖ్యంగా ఆయన తన దగ్గర పని చేసే ఉద్యోగులని ఎంతో బాగా చూసుకునే వారు, ఈ లాక్ డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే ఉద్యోగులని ఇబ్బందది పెట్టకుండా అందరికీ జీతాలు చెల్లించారు.
సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన మూడు రోజుల ముందు తన సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించారట.. అంతే కాదు లాక్ డౌన్ సమయంలో గతంలో చెల్లించిన దాని కంటే.. ఎక్కువగా చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఇక ముందు తాను జీతం ఇవ్వలేనని.. సున్నితంగా వారికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చకు కారణం అయింది.. ఆయన చనిపోవాలి అని ముందు డిసైడ్ అయి ఇలా అన్నారా, లేదా ఆర్దిక ఇబ్బందుల వల్ల ఇలా అన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.