మార్చి నెలలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంను కూల్చి గద్దెనెక్కిన బీజేపీ ఈశాన్య రాష్ట్రాంలో మాత్రం తన పట్టును నిలుపుకోలేక పోయింది.. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది… ఇప్పటివరకు బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారిక బీజేపీకి సపోర్టును ఉప సంహరించుకున్నట్లు ప్రకటించడంతో అక్కడ ప్రభుత్వ కష్టాల సుడిలో చిక్కుకుంది…. 2017 లో మణిపూర్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెల్చుకుని అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది…
బీజేపీ 21 సీట్లు సాధించింది… మొత్తం 60 సీట్లున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది… 31 ఉండగా రెండు జాతీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో నేషనల్ పిపుల్ పార్టీ నాగా పీపుల్ ఫ్రంట్ మరియు లోక్ జనశక్తి పార్టీ లు మద్దతు తెలపడంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది… నేషనల్ పార్టీ నాగా పిపుల్ ఫ్రంట్ కు చెరో నలుగురు ఎమ్మెల్యులు ఉండగా లోక్ జనశక్తి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు…ఇక స్వతంత్ర అభ్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టింది…
బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తాజాగా మణిపూర్ లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇబ్బంది తప్పవని తెలుస్తోంది… నేషనల్ పిపుల్స్ పార్టీ మద్దుతు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పడంతో జీరేన్ సింగ్ ప్రభుత్వంలో మైనార్టీ పడిపోతుంది… అంతేకాదు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా జెండాను ఎగరవేస్తూ రాజకీయాలు చేయడంతో బీరేన్ సింగ్ కు కష్టాలు తప్పవని అంటున్నారు కొందరు…