ఏపీలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది.. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది, ఇక సడలింపులు ఇవ్వడంతో కేసులు మరిన్ని కొత్తగా వస్తున్నాయి, అందరూ రోడ్లపైకి రావడంతో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, అందుకే కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు పెడుతున్నారు, అంతేకాదు అక్కడ లాక్ డౌన్ అమలుచేస్తున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాల్లో జూన్ 25 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఈ సమయంలో మాత్రమే షాపులు తెరుస్తారు, తర్వాత అన్నీ మూసేయాల్సిందే అని వెల్లడించారు.
ఇక మద్యం షాపులు కూడా కచ్చితంగా ఉదయం 11 గంటలకు క్లోజ్ చేయాల్సిందే, ఇక అన్నీ రకాల రవాణాపై నిషేదం ఉంది, కేవలం వైద్యానికి మాత్రమే అనుమతి ఉంది.. మెడికల్ షాప్స్, ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులకు లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
కంటైన్మెంట్ జోన్ల పరధిలో అంతర్ జిల్లా ప్రజా రవాణాను నిలిపివేస్తారు. ఎవరైనా సరే మాస్క్ ధరించాల్సిందే.