తెలంగాణ‌లో క‌రోనా టెస్టుల‌కి బ్రేకులు ఎందుకంటే

తెలంగాణ‌లో క‌రోనా టెస్టుల‌కి బ్రేకులు ఎందుకంటే

0
82

తెలంగాణ‌లో క‌రోనా పాజిటీవ్ కేసులు రోజుకి 800 వ‌స్తున్నాయి, దీంతో భారీగా పాజిటీవ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి, ఈ స‌మ‌యంలో టెస్టుల సంఖ్య మ‌రింత పెంచాలి అని భావిస్తున్నారు,
కేసుల తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి 50 వేల టెస్ట్‌లు చేయడానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం…

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి… ఆ పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో ఈ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.. కాని తాజాగా ఈ ప్ర‌క్రియ‌ని ఆపేశారు అని తెలుస్తోంది, ఇప్పటికే కొన్ని వేల శాంపిల్స్ సేక‌రించారు, వాటికి టెస్టింగ్ ప్ర‌క్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

అందుకే రెండు రోజులు పూర్తిగా గ్యాప్ ఇచ్చారు. ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు టెస్ట్‌లను నిలిపివేశారు అధికారులు.. కాగా, రాష్ట్రంలో టెస్ట్‌లు పెరగడంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.. రెండు రోజుల త‌ర్వాత కొత్త టెస్టులు చేస్తాము అని తెలిపారు అధికారులు.