భ‌ర్త భార్య సీక్రెట్ వ్య‌భిచారం వీరికి ఎవ‌రు హెల్ప్ అంటే ?

భ‌ర్త భార్య సీక్రెట్ వ్య‌భిచారం వీరికి ఎవ‌రు హెల్ప్ అంటే ?

0
86

గ‌తంలో ఊరు అవ‌త‌ల ఎక్క‌డో గుట్టుగా వ్య‌భిచార గృహాలు నిర్వ‌హించేవారు ఇప్పుడు ప‌రిస్దితి మారిపోయింది, ఫ్యామిలీలు ఉండే అపార్ట్ మెంట్ల‌లో గుట్టుగా ఈ చీక‌టి దందా చేస్తున్నారు, అలాగే స్పాలు బ్యూటి పార్ల‌ర్ల పేరుతో ఇక్క‌డ కొంద‌రు వ్య‌భిచార కేంద్రాలు న‌డుపుతున్నారు.

వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులో జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో ఈ ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.
శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వెల్ నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్‌లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు.

ఇది కొత్త దందాగా చేస్తున్నారు, ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో కూడా గుట్టుగా వీరివ్య‌వ‌హారం సాగుతోంది. ఇక ఆమె త‌న మొబైల్ నెంబ‌ర్ ఆ వెబ్ సైట్లో పెట్టింది, దానికి ఎవ‌రైనా కాల్ చేస్తే వివ‌రాలు చెబుతోంది, వీరికి సాయంగా మరో యువ‌తిని పెట్టుకున్నారు. ఆమెకు నెలకు రూ.10,000 ఇస్తోంది.

మరోవైపు బ్రోకర్ల సాయంతో వీరు ఉత్తరాది రాష్ట్రాలనుంచి మహిళలను తీసుకువచ్చి వారితో వెల్ నెస్ సెంటర్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.ఇక ఈమెకు భ‌ర్త కూడా స‌హ‌కారం చేస్తున్నాడు, దీంతో పోలీసులు వీరి వ్య‌వ‌హారం తెలిసి అక్క‌డ దాడి చేశారు న‌లుగురు యువ‌తులు ఇద్ద‌రు విటులు అరెస్ట్ అయ్యారు.