వైసీపీలోకి మాజీ మంత్రి కోడలు…

వైసీపీలోకి మాజీ మంత్రి కోడలు...

0
102

ఏపీలో ఒకవైపు కరోనా వైరస్ విజృంబిస్తుంటే మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు చందన శివాజీ వైసీపీ కండువాను కప్పుకున్నారు…

పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ… దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుంటుంబం అంటే అత్తమామలైన మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మీదేవమ్మ నారాయణప్పలకు ఎంతో గౌరవమని అన్నారు… శివాజీతో తన పెళ్లి జరిగినప్పుడు స్వయానా రాజశేఖర్ రెడ్డినే పెళ్లిపెద్దగా ఉండి నడిపించారని అన్నారు…

వైఎస్ తనయుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశయాలు సాధన దిశగా అభిష్టం మేరకు పార్టీలో చేరానని అన్నారు… నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు…