తాళి ఒకరి కాకుండా మరొకరికి కట్టిన పెళ్లి కొడుకు చివరకు ఏం జరిగిందంటే

తాళి ఒకరి కాకుండా మరొకరికి కట్టిన పెళ్లి కొడుకు చివరకు ఏం జరిగిందంటే

0
89

వివాహం చేసుకునే అబ్బాయి ఒకరికి కాకుండా మరొకరికి తాళికట్టడం అనే సీన్ ఎప్పుడూ విని ఉండరు.. చివరి సీన్లో ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి లవ్ ట్రాక్ ఉంటే, పెళ్లి ఆగిపోవడం ప్రియుడు పెళ్లి చేసుకోవడం చూసి ఉంటాం.. కాని ఇక్కడ సీన్ మొత్తం మారింది.

ఇక్కడ రత్న అనే యువకుడు పెళ్లి చూపులకోసం రమూన్ పురా వెళ్లాడు, అక్కడ నీలం అనే అమ్మాయిని చూశాడు కాని ఈ లాక్ డౌన్ వేళ పది మంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేయాలి అని భావించారు, అయితే రత్న మాత్రం నీలం చెల్లిని చూసి ఆమెని ఇష్టపడ్డాడు.

అయితే వివాహం జరుగుతున్న సమయంలో నీలం చెల్లెలు ఆమె పక్కనే ఉంది, వెంటనే నీలంకు కాకుండా ఆమె చెల్లి సత్యకి తాళి కట్టాడు, దీంతో అక్కడ వారు అందరూ షాక్ అయ్యారు, తనంటే ఇష్టం అని అందుకే ఇలా చేశాను అని చెప్పాడు, కాని అందరి ముందు జరగడంతో ఇక ఆమె చెల్లితోనే కాపురం చేయమని అన్నారు, ఇదేదో ముందు చెప్పి ఉంటే బాగుండేది కదా అని పెద్దలు తీవ్రంగా మందలించారు, కాని చివరకు సత్య కూడా అతనితో పెళ్లికి అంగీకరించింది.