ఫ్లాష్ న్యూస్ – తెలంగాణ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

ఫ్లాష్ న్యూస్ - తెలంగాణ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

0
108
Telangana

తెలంగాణ‌లో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది.. ఈ స‌మ‌యంలో హైద‌రాబాద్ ప‌రిధిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి, అందుకే ఇక్క‌డ కేసులు పెరుగుతున్న కార‌ణంతో పూర్తిగా లాక్ డౌన్ విధించాలి
అని చూస్తున్నారు, ఇక తాజాగా ప‌రీక్ష‌ల విష‌యంలో ఇప్ప‌టికే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు.

అయితే తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్ ..రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్‌లన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఓప‌క్క పూర్తిస్ధాయి లాక్ డౌన్ విధించాలి అని చూస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు వ‌ద్దని స‌ర్కార్ భావించింది. ఈ స‌మ‌యంలో పరీక్షలు నిర్వహిస్తే రిస్క్ కొని తెచ్చుకున్న వారమవుతామని వాయిదా వేసింది ప్రభుత్వం. ఇక రేప‌టి నుంచి జూలై నెల 15 వరకు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఖరారు చేసింది .సో ఇక ఏ ప‌రీక్ష‌లు ఇప్పుడు నిర్వ‌హించ‌రు, రేపు లేదా ఎల్లుండి లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకుంటారు.